Tuesday, 12 April 2016

KUPGCET Notification 2016 online apply

కేయూ పీజీ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల
కాకతీయ, కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయాల్లోని పీజీ, పీజీ డిప్లొమా, పీజీ ఐదేళ్ల కోర్సుల్లో 2016-2017 విద్యాసంవత్సరానికిగాను ప్రవేశాల కోసం కేయూ అధికారులు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు. సోమవారం సాయంత్రం కేయూ ప్రవేశాల సంచాలకులు ఆచార్య ఎం.కృష్ణారెడ్డి, సంయుక్త సంచాలకులు డాక్టర్‌ వై.వెంకయ్య, డాక్టర్‌ జె.లక్ష్మణ్‌నాయక్‌లు ప్రవేశాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు.

వచ్చేనెల 3వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తులను స్వీకరిస్తారు.

రూ.600ల అపరాధ రుసుంతో 10వ తేదీలోగా దరఖాస్తులను చేసుకోవచ్చు.

వచ్చే నెల ఆఖరు వారం నుంచి పీజీ ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్షలు ప్రారంభమవుతాయి.

మీసేవా, ఏపీ ఆన్‌లైన్‌, ఇంటర్‌నెట్‌ సెంటర్లలో ‘‘డబ్లూడబ్లూడబ్లూ.కాకతీయ.ఏసీ.ఇన్‌’’ ‘‘డబ్లూడబ్లూడబ్లూ. కేయూడీవోఏ.ఇన్‌’’ అనే వెబ్‌సైట్స్‌ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

No comments:

Post a Comment